భవన యజమానులు గురుకుల పాఠశాలలకు  తాళం వేసారు

 గురుకుల పాఠశాల భవనానికి  అద్దె చెల్లించడం లేదని యజమాని పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి , సూర్యాపేట  జిల్లాలో చోటుచేసుకుంది. మోత్కూర్ లోని  గురుకుల పాఠశాలకు భవన యజమాని తాళం వేశారు.  తొమ్మిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని.. ఎన్ని సార్లు అడిగినా  ఎలాంటి ఉపయోగం లేదని భవన యజమాని తెలిపారు.  గేటుకు తాళం ఉండటంతో ఉపాధ్యాయులు, పిల్లలు గేటు బయట పడిగాపులు కాస్తున్నారు.

హుజూర్​ నగర్​ లో కూడా..

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​లోని గురుకుల పాఠశాలకు కూడా బిల్డింగ్​ యజమాని తాళం వేశారు.  ఏడాదిగా కిరాయి ఇవ్వడం లేదని.. ఇప్పటికి చాలా సార్లు ప్రైవేట్ భవన యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో  ఉన్నతాధికారులకు వినతి పత్రం  ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  పెండింగ్​ అద్దె బకాయిలను చెల్లించిన తరువాతనే తాళాలు తీస్తామని చెబుతున్నారు. పాఠశాల గేటుకు తాళం వేయడంతో  చెట్ల కింద ఉపాధ్యాయులు కూర్చున్నారు.